హైదరాబాద్ లో అరెస్టయిన భవాని భర్త... 'అలిపిరిలో చంద్రబాబుపై హత్యాయత్నం' కేసులో వున్న వ్యక్తే!

  • మౌలాలిలో నలుగురు నక్సల్స్ అరెస్ట్
  • 15 ఏళ్ల క్రితమే మావోగా భవాని భర్త కృష్ణ
  • చంద్రబాబుపై దాడి కుట్రలో ఉన్నాడన్న పోలీసులు
రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని మౌలాలి ప్రాంతంలో ముగ్గురు మహిళలు సహా నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరికి గడచిన 15 సంవత్సరాల నుంచి మావోయిస్టులతో సంబంధముందని పోలీసులు తేల్చారు. భవాని భర్త కృష్ణ అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన హత్యాయత్నం కుట్రలో భాగస్వామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కృష్ణ మావోయిస్టు క్యాడర్ లో డీసీఎంగా పని చేశాడని అన్నారు. విశాఖ పోలీసులు హైదరాబాద్ లో దాడులు చేసి, అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ, ముగ్గురు అక్కా చెల్లెళ్లు సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Go Back to Shorts
Alipiri
Chandrababu
Moulali
Hyderabad
Maoists
Arrest

More Telugu News